చంద్రబాబుకి దమ్ముంటే అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని సవాల్ విసిరారు రోజా. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు అమరావతి ప్రాంతంలో కొనుగోలు చేశారన్నారు రోజా. టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు రోజా.