సీఎం జగన్ ఈనాడుని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ మంత్రులిద్దరూ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈనాడులో తప్పుడు కథనాలు వస్తున్నాయని మండిపడ్డారు. పెట్రోల్ రేట్లు పెంచడంపై ఈనాడు వాస్తవాలను దాచి పెట్టిందని ఆరోపించారు. ఇకనైనా వాస్తవాలు ఇవ్వాలని హితవు పలికారు.