మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాలవారు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.