ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలోని బీజేపీకి కాస్త దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీని, మొదట నుంచి వైసీపీ గట్టిగా డిమాండ్ చేయలేకపోతుంది. ఇప్పటికే విభజన చట్టంలోని పలు హామీలు, ప్రత్యేకహోదా లాంటి అంశాలు పక్కకు వెళ్లిపోయాయి. అలా అని బీజేపీపై పోరాడితే రాష్ట్రానికి నష్టమే తప్పా, లాభం లేదు అందుకనే వైసీపీ, కేంద్రంతో సఖ్యతతో మెలుగుతోంది.