చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి నీతి వాక్యాలు బాగా చెబుతున్నారు. ఓడిపోయి బాగా ఖాళీగా ఉండటం వలన అనుకుంటా, బాబు హైదరాబాద్లోని ఇంట్లో కూర్చుని జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తుందని విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అలాగే వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతుండటంతో, బాబుకు ఫ్రస్టేషన్ కూడా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా విశాఖకు చెందిన వాసుపల్లి గణేశ్ టీడీపీని వీడి, జగన్కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయన తన ఇద్దరు తనయులని వైసీపీలో చేర్పించారు.