2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే విజయమ్మ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి జగన్ విశాఖని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదిపారు. ప్రధానంగా విజయసాయి రెడ్డి విశాఖలోనే సెటిల్ అయ్యి, వైసీపీ జెండా ఎగిరేవరకు విశ్రమించలేదు. ఇక వీరి కష్టం ఫలితంగానే 2019 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ దుమ్ములేపింది.