టీడీపీ అధినేత చంద్రబాబు అంటే మంత్రి కొడాలి నాని ఒంటికాలి మీద వెళ్తారనే విషయం తెలిసిందే. కొడాలి టీడీపీని వీడిన దగ్గర నుంచి బాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు విమర్శలు అనడం కంటే కాస్త పరుష పదజాలం వాడుతూ, బాబుని బండ బూతులు తిడతారని చెప్పొచ్చు. ఇక కొడాలి మంత్రి అయ్యాక మరింతగా బాబుపై విరుచుకుపడుతున్నారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా బూతులతో ఆడేసుకుంటున్నారు.