సీఎం రిలీఫ్ ఫండ్ ని కొల్లగొట్టాలని చూసిన కొంతమంది వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులు, నకిలీ చెక్కులతో ఏకంగా రాష్ట్ర ఖజానాకే కన్నం వేయాలని చూశారు కొందరు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్రమత్తమైనా.. దీని వెనక ఉన్న కుట్రను ఛేదించే ఉద్దేశంతో సీఎం ఏసీబీ విచారణకు ఆదేశించారు. నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం జగన్ నిర్ణయించారు.