ఏపీ రాజకీయాలు మంత్రి కొడాలి నాని చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయన ఏపీలో బాగా హైలైట్ అవుతున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటని ప్రతిపక్షాలు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా కూడా ఆయన హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు జరిగితే ఏం అవుతుందనే విధంగా కొడాలి మాట్లాడినట్లు ప్రతిపక్షాలు క్రియేట్ చేసి విమర్శలు చేస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.