టీడీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ కుమార్లు చంద్రబాబుకు గుడ్ బై చెప్పి, జగన్కు జై కొట్టారు. అయితే వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు నడిచే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఎంతమంది పార్టీని వీడతారో తెలియదు గానీ, రానున్న రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మరింత తగ్గనుందని తెలుస్తోంది.