హైకోర్టు విధించిన గ్యాగ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఓ న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేశారు. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన కుంభకోణాలపై మంత్రివర్గ ఉపసంఘంతో ముందు అంతర్గతంగా విచారణ జరిపించింది. తర్వాత మంత్రివర్గ ఉపసంఘం నివేదిక, సిఫారసులతో కొన్నింటిపై ఏసిబితోను మరికొన్నింటిపై సిబిఐ విచారణ జరిపించాలని డిసైడ్ చేసింది. అయితే తమ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఎటువంటి విచారణ జరగకుండా టిడిపి నేతలు కోర్టులో పిటీషన్ వేసి స్టే తెచ్చుకున్నారు. ఇదే సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంభకోణాల్లో అత్యంత కీలకమైన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రభుత్వం ఏసిబి విచారణకు ఆదేశించింది.