కొందరు పెద్దలు చేస్తున్న అనాలోచిత వ్యవహారాల వల్లే టిటిడి తరచూ వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే అన్యమతస్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తమకు శ్రీ వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఫారంపై ప్రముఖులు సంతకాలు చేస్తారు. దర్శనానికి వచ్చినపుడు గతంలో కొందరు సంతకాలు చేశారు కొందరు చేయలేదు. నిజానికి ఇది ప్రముఖుల వ్యక్తిగత విషయం. దీనికి మిగిలిన జనాలకు ఏమాత్రం సంబంధం లేదు.