ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా పోలీసులకు ఉన్న అధికారాలకు కత్తెర పడినట్లయింది, వారితో ప్రజలు నేరుగా కాంటాక్ట్ అవ్వాల్సిన పని తగ్గిపోయింది. అంటే యాప్ ద్వారా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చు. యాప్ లో ఫిర్యాదు చేస్తే.. అది రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. ఇక దానిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అసలు విచారణ మొదలు పెట్టారా లేదా? విచారణ ఎంతవరకు వచ్చింది? తదితర విషయాలన్నీ ఫోన్ లోనే ప్రత్యక్షం అవుతాయి.