దళితులపై చులకన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజుకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు మరో ఎంపీ నందిగం సురేష్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే రఘురామకృష్ణంరాజు పెట్టుకున్నారని ఆయనకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ చేతిలో పెడతామని సురేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే రఘురామకృష్ణంరాజును పదవి విషయంలో, విగ్గు విషయంలో ఆయన అంతకు ముందున్న ఒరిజినల్ స్థితికి తెస్తామని నందిగం సురేష్ హెచ్చరించారు.