ఏపీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసల జల్లు కుపిరించారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు. ప్రజలకు ఏ మాత్రం భారం కాకుండా విద్యుత్ రంగాన్ని కాపాడాలనే ఆయన ఆలోచనలు అభినందనీయమన్నారు. సంస్కరణ దిశగా అడుగులేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.