పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన కింద ప్రతీ నెల రూ.3,000 పెన్షన్ ని తీసుకోవచ్చు. దీనితో ఏడాదికి రూ.36,000 వస్తాయి. ఈ పధకానికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు అర్హులు. దాదాపు 45 లక్షల మంది ఈ పథకంలో ఇప్పటి దాక చేరారు. 18 ఏళ్ల వయసు వారైతే మీకు 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతీ నెల రూ.55 కట్టాలి. కనుక రోజుకు రూ.2 ఆదా చేసుకుంటే మీరు నెలకు రూ.3,000 పొందవచ్చు. అంటే సంవత్సరానికి రూ.36 వేలు మీకు లభిస్తుంది.