ఇటీవల ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరికి మధ్యలో బీజేపీ కూడా రెండు పార్టీలపై విమర్శలు చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విషయంలో వైసీపీ, టీడీపీలు మద్ధతు ఇస్తూ, రాష్ట్రంలో మాత్రం రాజకీయం చేస్తున్నాయి. అయితే కేసులు తప్పించుకోవడానికి జగన్…కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే, బాబు...మోడీ కరుణ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.