ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేసి తెలంగాణకు ఒక అధ్యక్షుడుని, ఏపీకి ఒక అధ్యక్షుడుని నియమించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తాను జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతూ, తెలంగాణకు ఎల్ రమణని, ఏపీకి కళా వెంకట్రావుని అధ్యక్షులుగా పెట్టారు. అయితే తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి అక్కడ చంద్రబాబు జోక్యం ఉండటం లేదు. దీంతో ఏదో నిదానంగా రమణ పార్టీని నడిపించుకుంటూ వెళుతున్నారు.