వర్షాలు లేక సాగునీటికోసం బోర్లపై ఆధారపడే రైతన్నలకు ‘వైఎస్సార్ జలకళ’ ఓ వరం లాంటిది. తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద రైతులందరికీ ఉచితంగా బోర్లు వేసిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేసేందుకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ఉచితంగా బోర్లు వేసే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ఈనెల 28న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.