కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ రైల్వే ప్రస్తుతం స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుపుతోంది. కానీ పండుగల్లో మాత్రం ఇలా కాకుండా ప్రయాణికులకు సులువుగా ఉండేలా మరి కొన్ని రైళ్లని తీసుకు రానున్నారు. తాజాగా మరో 80 కొత్త స్పెషల్ ట్రైన్స్‌ను వచ్చే నెల నుంచి పట్టాలెక్కించడానికి ఇండియన్ రైల్వేస్ సిద్ధం అవుతోందని తెలుస్తోంది .