ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన బాబు...ఏపీలో టీడీపీ కేడర్‌లో జోష్ నింపే నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగు రోజుల్లోనే ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడుని నియమించనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావు స్థానంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని అధ్యక్షుడుగా పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.