కొడాలి నాని...ఏపీ రాజకీయాల్లో బాగా బాగా హాట్ టాపిక్ అయిన నాయకుడు. మొన్నటివరకు టీడీపీనే టార్గెట్ చేసుకుని తీవ్రమైన విమర్శలు గుప్పించే నాని ఇప్పుడు బీజేపీని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే అక్కడ రాజధాని వద్దని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పి సంచలనం సృష్టించిన నాని, తాజాగా హిందూ దేవాలయాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.