ఏరు దాటాక తెప్పతగలేసే రకాలు రాజకీయాల్లో చాలామంది ఉంటారు. అవసరం ఉన్నంత సేపు ఒక పార్టీతో ఉండి, అవసరం తీరిపోయాక ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి జంప్ కొట్టేస్తారు. అలా జంప్ కొట్టడంతోనే ఆగకుండా, మాజీ పార్టీని తెగ తిడతారు. అసలు ఆ పార్టీ వేస్ట్ అన్నట్లు మాట్లాడతారు. ఇలా ఎక్కువశాతం ఏపీ రాజకీయాల్లో నాయకులు నడుచుకుంటూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుకు జై కొట్టి, జగన్ని తెగ తిట్టారు. అలాగే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో, టీడీపీ ఎమ్మెల్యేలు జగన్కు మద్ధతు ఇస్తూ, బాబుపై విమర్శలు చేస్తున్నారు.