తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని వల్ల రైతులు నష్టపోతారని ఫైర్ అవుతున్నారు. అయితే ఏదేమైనా ఒకప్పుడు షరతుల్లేకుండా వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ విషయంలో ఇప్పుడు కేంద్రం చెప్పిందని మీటర్లు బిగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఏపీలో డిసెంబర్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా, వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీటర్ల బిగింపు ప్రారంభం కాబోతోంది.