ఏపీలో చంద్రబాబు కొత్త కొత్త వ్యూహాలతో ముదుకెళుతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఏడాది దాటాక పార్టీని ప్రక్షాళన చేసే దిశగా పయనిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడుని నియమించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావుని తప్పించి, ఆయన స్థానంలో అచ్చెన్నాయుడుని పెట్టడానికి ఫిక్స్ అయ్యారు. వైసీపీ మీద దూకుడుగా వెళ్ళే అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇస్తే, ఏపీలో టీడీపీకి మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు.