కొవిడ్ నియంత్రణ చర్యలపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ నియంత్రణకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్ని కూడా ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్ల వ్యవస్థ పని తీరు బాగుందని ప్రధాని ప్రశంసించారు. ఈ వ్యవస్థల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, వారికి త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయని అన్నారు మోదీ.