రాష్ట్ర మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ.. మంత్రి నాని వ్యాఖ్యలను ఖండించింది. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు.