వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో అభివృద్ది చేసిన నాసల్ స్ప్రే ను, కొవిడ్ వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దీన్ని కూడా ఓ విధమైన వ్యాక్సిన్ గానే గుర్తించే అవకాశముంది. ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో తయారీ సంస్థ దీన్ని మార్కెటింగ్ చేస్తుంటగా.. మిగతా దేశాల్లో మార్కెటింగ్ చేసుకునేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదర్చుకుంది. దీనిపై ఇప్పుడు ఇండియాలో క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించాల్సి వుంది.