చంద్రబాబుపై ఉన్న కేసులు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రత్యర్ధులు ఎప్పుడు బాబు కోర్టులో స్టేలు తెచ్చుకుని బ్రతుకుతారని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా పలువురు వైసీపీ నేతలు ఇదే అంశంపై బాబుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం, బాబుపై 26 కేసులు ఉన్నాయని, వాటిపై స్టే వేకెట్ చేస్తే, బాబు బయట ఉండరని మాట్లాడారు.