ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ కొట్టేస్తున్నారు. తమ అవసరాలకు తగ్గట్టుగా పార్టీ కండువా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చేసి, జగన్కు జై కొట్టేశారు. ఇటీవలే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా టీడీపీలో ఉండటం కష్టమని భావించి, వైసీపీకి మద్ధతు ఇచ్చారు.