ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, మంత్రి కొడాలి నానిల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతుందనే సంగతి తెలిసిందే. నిత్యం వీరి మధ్య ఏదొక విషయంపై రభస జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఏపీలో సీన్ మారినట్లు కనిపిస్తోంది. బీజేపీ వర్సెస్ కొడాలి నాని అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వలనే ఏపీలో బీజేపీ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. జగన్ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో కొడాలి నాని వారికి కౌంటర్ ఇచ్చారు.