చిత్తూరు జిల్లా…. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. పేరుకే చంద్రబాబు సొంత జిల్లా గానీ, ఇక్కడ ఆధిక్యం జగన్‌దే. ఆ విషయం 2014, 2019 ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. జిల్లాలో వైసీపీ డామినేషన్ ఫుల్‌గా ఉందని తెలుస్తుంది. 2014లో రాష్ట్రంలో టీడీపీ వేవ్ ఉన్నా సరే, చిత్తూరులో జగన్ హవా కనిపించింది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ 6 గెలిచింది. అలాగే ఒక ఎంపీ సీటు వైసీపీ, మరొకటి టీడీపీ గెలుచుకుంది.