టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బెంజ్ కారుని వదిలేలా కనిపించడం లేదు. కారు సంగతి తేలేవరకు మంత్రి జయరాంకు తిప్పలు తప్పేలా లేవు. ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న కార్తీక్, మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్‌కు బెంజ్ కారు లంచంగా ఇచ్చారని అయ్యన్న ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అలాగే దానికి సంబంధించిన ఆధారాలు, ఫోటోలని కూడా మీడియాలో వదిలారు.