క్వారంటైన్ పూర్తయి, లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాక కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అయితే వీరి నుండి వైరస్ మరొకరికి సోకే ప్రమాదం ఉండదని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పలువురు ప్రముఖ వైద్యులు కూడా కరోనా రోగులకు ఇదే సలహా ఇస్తున్నారు. 17రోజుల క్వారంటైన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా ప్రమాదం లేదని, కేవలం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. క్వారంటైన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా దానిపై గాభరా పడాల్సిన అవసరం లేదంటున్నారు.