టీడీపీ ఎంపీలు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీఎం జగన్ రహస్య మంతనాలు జరిపారని అన్నారు. సీఎం జగన్ ఢిల్లీ వచ్చి రహస్య మంతనాలు నడిపారు తప్ప చేసిందేమీ లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండేదని.. వైసీపీ వచ్చాక మత కలహాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.