తెలంగాణలో నూతనంగా తీసుకొస్తున్న చట్టాల అమలుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు రోజుకి 24 గంటలు శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం కేసీఆర్. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు కొత్త చట్టాల అమలులో భాగస్వాములు కావాలని సూచించారు. తేడా వస్తే చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధమని హెచ్చరికలు జారీ చేశారు.