ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్లైన్ లో బెట్టింగ్ చేస్తున్నారు. పల్లె, పట్టణం అనేమీ లేదు. ఎక్కడ చూసిన అదే జోరు. ఒక్కో మ్యాచ్ పై సుమారు రూ. వెయ్యి నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో సాగుతోందని సమాచారం. అలానే రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇలానే సాగుతోంది.