గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు మంత్రి కొడాలి నాని వర్సెస్ ప్రతిపక్షాలు అన్న విధంగా నడుస్తున్నాయి. అధికార పార్టీ తరుపున కొడాలి నాని ధీటుగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటే, ప్రతిపక్ష నేతలు మాత్రం నాని ఏం మాట్లాడినా వివాదం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. అయితే కొడాలి నానికి టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు జగన్పై విమర్శలు చేస్తే, కొడాలి బాబుపై ఏ మాత్రం మొహమాటం లేకుండా విరుచుకుపడుతుంటారు. పనిలో పనిగా తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాని అయితే ఓ ఆట ఆడేసుకుంటారు.