జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్గా రాజకీయాలు నడిచాయనే చెప్పొచ్చు. అచ్చెన్న గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్పై ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే. చాలా వ్యక్తిగతంగా జగన్పై విమర్శలు చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధికార వైసీపీకి ధీటుగానే నిలబడటం చేశారు.