రైతు భరోసా కేంద్రాల వద్దే పంట సేకరణ జరగాలని చెప్పారు సీఎం జగన్. భవిష్యత్తులో ఆర్బీకేలు పూర్తి స్థాయి ధాన్యం సేకరణ కేంద్రాలుగా మారాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా తరహా ఘటన పునరావృతం కాకుండా చూడాలని, రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు మద్దతు ధర కోసం రూ.3,300 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు.