‘‘జీవితాంతం టీడీపీకి రుణపడి ఉంటా. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రబాబు, లోకేశ్ మద్దతిచ్చారు. పార్టీ వారంతా అండగా నిలిచారు’’ అంటూ చంద్రబాబుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో భావోద్వేగానికి గురయ్యారు అచ్చెన్నాయుడు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలుచేసినా తాము టీడీపీకి అండగా ఉంటామని, తమకి పార్టీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.