2015 లో కర్నూల్ జిల్లా రుద్రవరం మండలం తహశీల్దార్, మరియు ముత్తులూరు గ్రామ వీఆర్వో ఇరువురూ కలిసి రెవెన్యూ మాన్యువల్ రికార్డ్స్ అయిన అడంగల్ మరియు 1-B నందు నా భార్య తండ్రిగారు అనగా నా మామగారు అయిన కీ. శె. సీళ్ల సంజీవరెడ్డి గారికి చెందిన పొలాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మహిళలకు ఇచ్చారు. దీనిని అడ్డు పెట్టుకొని సదరు ఎస్సీ మహిళల కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు.మేము లీగల్ గా రెండు సంవత్సరాలు అన్ని ఆధారాలతో పొరాడగా 06-06-2017 న నంద్యాల ఆర్డీవో గారు సదరు ఎస్సీ మహిళలకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కానీ మా ఈ పోరాట క్రమంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నాము. మా ఇబ్బందులకు కారణమైన సదరు ఎమ్మార్వో, వీఆర్వో లలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారివల్ల ఆర్థికంగా మానసికంగా నష్టపోయిన మాకు నష్టరిహారాన్ని చెల్లించాలని ఎన్నిసార్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి, నంద్యాల ఆర్డీవో గారికి విన్నవించుకున్నా మాకు నష్టపరిహారం కాదు కదా కనీసం వారిపై చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు మీ ద్వారా ఐనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము.