కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైల్ రోకోలో భాగంగా పంజాబ్లో వేలాది మంది రైతులు రైల్వే పట్టాలపై అడ్డంగా పడుకుని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకోనంత వరకు తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపున్చి తమ ఆందోళనను సెప్టెంబర్ 29 వరకు పొడిగించడం గమనార్హం.