ఏపీలో టీడీపీలో కొత్త మార్పులు తీసుకోచ్చేందుకు చంద్రబాబు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లోనే ఉంటూ ఏపీలో టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడుని మార్చనున్నారు. కళా వెంకట్రావుని పక్కనబెట్టి, అధ్యక్ష బాధ్యతలు అచ్చెన్నాయుడుకు అప్పగించనున్నారు. అలాగే పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాల విభజన జరగనుండటంతో, 25 పార్లమెంట్ స్థానాలకు కొత్త అధ్యక్షులని నియమించనున్నారు.