చంద్రబాబు ప్రతిరోజూ భోజనం చేస్తారో తెలియదుగానీ, జగన్ మీద మాత్రం విమర్శలు చేయకుండా ఉండరు. జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి బాబు ఏదొరకంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తనకంటే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన జగన్ సీఎం అవ్వడం చూసి ఓర్వలేకపోతున్నారు అనుకుంటా, అందుకే బాబు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తుంటారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేదలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కోర్టుల ద్వారా ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకున్నారు.