వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా అంటించి తనను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి.. కరోనా అంటించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు రఘురామ కృష్ణంరాజు. కొంతమంది ప్రభుత్వ పెద్దల చర్యలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.