తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ని దెబ్బకొట్టాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ వెళ్తోంది. తాజాగా కేంద్ర పార్టీ కార్యవర్గంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యమిచ్చారు నేతలు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇక తెలంగాణకే చెందిన డాక్టర్ కె.లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం కూడా విశేషమే.