ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో వెసులుబాటు కల్పించింది. డిపార్ట్మెంటల్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానాన్ని తొలగించింది. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెగిటివ్ మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు. పరీక్షల్లో ఒక తప్పు సమాధానం పెడితే.. 1/3 వంతున మార్కులు మైనస్ చేసేవారు. ఇప్పుడీ విధానాన్ని ప్రభుత్వం తొలగించడంతో ఉద్యోగులకు ఊరట లభించింది.