శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సడెన్ గా నిన్న మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో భేటీ అయ్యారు. ముంబైలోని ఓ హోటల్ లో రహస్యంగా దాదాపుగా గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ పార్టీ నేతలు దీనిగురించి స్పందిస్తూ సంజయ్ రౌత్ కేవలం శివసేన అధికార పత్రిక సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఇక్కడికి వచ్చారని మరే ఇతర రాజకీయ కారణాలకోసం కాదని పేర్కొన్నారు.