జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోక చిలుకను ఎంపిక చేయడానికి పోటీ జరుగుతోన్న ఫైనల్ పోటీ లో మొత్తం 7 రకాలు ఎంపిక అయ్యాయి. అయితే వాటిలో మన పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోక చిలుకలు కూడా ఉండడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలో ఉండే కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ ఈ మూడు రకాలు కూడా 2021 సంవత్సరానికి కొనసాగుతున్నాయి.